నార్పల: 'శిక్షణ తరగతులు సద్వినియోగం చేసుకోండి'
నార్పల మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ వార్షిక ప్రణాళికల తయారీపై బుధ, గురువారం ప్రజా ప్రతినిధులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో గంగావతి మంగళవారం తెలిపారు. ప్రతి పంచాయతీ నుంచి ఉప సర్పంచ్, ఇద్దరు వార్డు సభ్యులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణ కార్యక్రమాన్ని ప్రజా ప్రతినిధులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.