చాగల్లు జలాశయంలో జాలరులకు దొరికిన భారీ చేప
పెద్దపప్పూరు మండలంలో 25 కేజీలు బరువు, 4 అడుగులు ఎత్తు గల చేప లభ్యమైంది. పెద్దపప్పూరు మండల పరిధిలోని చాగల్లు గ్రామంలోని జలాశయంలో వెంకటరాముడు చేపలు పట్టేందుకు గురువారం వెళ్లాడు. చేపలు పడుతున్న సమయంలో భారీ చేప వలలో చిక్కుకుంది. విషయాన్ని గమనించిన స్థానికులు చేపను చూసేందుకు బారులు తీరారు.