పెద్దపప్పూరు మండలం కుమ్మెత గ్రామంలోని చౌడేశ్వరి దేవి ఆలయంలో సోమవారం జాతీయ చేతి వృత్తుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి జాతీయ చేతి వృత్తుల ఐక్యవేదిక జాతీయ కార్యదర్శి రుషింగప్ప హాజరయ్యారు. ఈ సందర్భంగా రుషింగప్ప మాట్లాడుతూ.. నేతన్న నేస్తం పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈనెల ఆఖరిలో కలెక్టరేట్ కార్యాలయం వద్ద నేతన్నలతో కలిసి ధర్నా చేస్తామన్నారు.