పెద్దపప్పూరు మండలంలో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం

80చూసినవారు
పెద్దపప్పూరు మండలంలో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం
పెద్దపప్పూరు మండల వ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని ఐసీడీఎస్ అధికారులు నిర్వహించారు. మండల పరిధిలోని బొందలదిన్నె గ్రామంలో ఐసీడీఎస్ సూపర్ వైజర్ రామలక్ష్మమ్మ అంగన్వాడీ టీచర్లు, సిబ్బందితో కలిసి గ్రామంలో అవగాహన కార్యక్రమం చేపట్టారు. అనంతరం గర్భవతులు, బాలింతలకు తల్లిపాలు ప్రాముఖ్యతపై క్షుణ్ణంగా అవగాహన కల్పించారు. పిల్లలకు తప్పకుండా తల్లిపాలనే ఇవ్వాలని సూచించారు.

సంబంధిత పోస్ట్