పెద్దపప్పూరు: వృద్ధురాలి బలవన్మరణం
పెద్దపప్పూరు మండలంలోని ముచ్చుకోట గ్రామానికి చెందిన రామసుబ్బమ్మ (67) ఆత్మహత్య చేసుకుంది. పక్షవాతంతో బాధపడుతున్న ఆమెకు తోడుగా ఉన్న భర్త గత నెల 30న అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ క్రమంలో ఒంటరి జీవితాన్ని భరించలేని ఆమె బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాగా, ఆమెకు ముగ్గురు కుమారులు ఉన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.