పెద్దపప్పూరు మండలాన్ని కరవు మండలంగా ప్రకటించాలని సిపిఎం మండల నాయకులు అమ్మలదిన్నె కుళ్లాయప్ప శనివారం మండల తహశీల్దారుకు వినతి పత్రం అందించారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న 31 మండలాలలో కేవలం 7 మండలాలను కరవు మండలాలుగా ప్రకటించడం చాలా దారుణమని తెలిపారు. మండల సిపిఎం ఆధ్వర్యంలో పెద్దపప్పూరు మండలాన్ని కరవు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని కోరారు.