శ్రీసత్య సాయి జిల్లా గోరంట్ల మండలం దిగువ గంగంపల్లి గ్రామంలో ఆదివారం పిడుగుపాటుకు గురై మృతి చెందిన భార్య, భర్త లు దేవిబాయి, దాశరథి నాయక్ మృతదేహాలకు మాజీ మంత్రి శంకర్ నారాయణ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి అంత్యక్రియల కోసం రూ 20వేల ఆర్థిక సహాయం చేశారు. అయన వెంట పార్టీ నాయకులు ఉన్నారు.