ప్రతి బాలిక లక్ష్యాన్ని ఎన్నుకుని దానికనుగుణంగా కష్టపడి చదువుకోవాలని పెనుకొండ డీఎస్పీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. శనివారం పెనుకొండ పట్టణంలోని ఎస్సీ బాలికల సంక్షేమ హాస్టల్లో బాలల హక్కుల వారోత్సవాలలో భాగంగా సీడీపీఓ శాంతలక్ష్మి అధ్యక్షతన జిల్లా బాలల పరిరక్షణ విభాగం, చిల్డ్రెన్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో డీఎస్పీ మాట్లాడుతూ బాలికలు బాల్య వివాహాలను ఎలా ఎదుర్కోవాలో వివరించారు.