పుట్లూరు: హార్టికల్చర్ అసిస్టెంట్ కు పదోన్నతి
పుట్లూరు మండలంలో విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న విశ్వేశ్వరి ఏఈవోగా శుక్రవారం పదోన్నతి పొందారు. మండల పరిధిలోని బాలాపురం గ్రామ సచివాలయం పరిధిలో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గా ప్రస్తుతం విధులు నిర్వహిస్తోంది. విశ్వేశ్వరి పదోన్నతి పొందడంపై తోటి సచివాలయ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.