పుట్లూరు: రూ.10 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ

57చూసినవారు
పుట్లూరు: రూ.10 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ
పుట్లూరు మండలంలోని పలు గ్రామాలలో శనివారం మండల అధికారులు పల్లె పండుగ వారోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల పరిధిలోని గోపురాజుపల్లి గ్రామంలో దాదాపు రూ. 10 లక్షల నిధులతో సీసీ రోడ్లు నిర్మాణానికి ఏపీఓ చెన్నకేశవులు, టీడీపీ నాయకులు రవికుమార్ రెడ్డి, తదితరులు కలిసి భూమి పూజ చేసి గ్రామ అభివృద్ధి పనులను ప్రారంభించారు. కూటమి ప్రభుత్వంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని వారు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్