పని సర్దుబాటు పేరుతో తరచూ ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టడం సరికాదని ఈ విధానంతో ఉపాధ్యాయులు తీవ్రమైన మానసిక ఆందోళనకు గురవుతున్నారని శుక్రవారం కొత్తచెరువు మండల కేంద్రంలో డిటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి షర్ఫోద్దీన్, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గౌస్ లాజమ్, మారుతి ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. తాత్కాలిక పని సర్దుబాటుకు విరామం పలికి అవసరమైన చోట విద్యా వలంటీర్లతో భర్తీ చేయాలని, నెలవారీ పదోన్నతులు ఇవ్వాలన్నారు.