అనంతపురం జిల్లా సోమందేపల్లిలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మంత్రి శంకర్‌నారాయణ కారును రైతులు అడ్డుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భూములకు పట్టాలు ఇప్పిస్తామని అధికారంలోకి రాగానే మాట తప్పారని రైతుల ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ భూముల్ని ఇంటి పట్టాల కోసం సేకరిస్తే ఆత్మహత్యలకైనా సిద్ధంగా ఉన్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.