రాప్తాడు: భూ నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలి: ఎమ్మెల్యే

69చూసినవారు
రాప్తాడు: భూ నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలి: ఎమ్మెల్యే
జీడిపల్లి రిజర్వాయర్ నుంచి పేరూరు ప్రాజెక్ట్ కు సాగు నీరు అందించే హంద్రీనీవా కాలువ నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు భూ పరిహారం ఇవ్వాలని ఎమ్మెల్యే పరిటాల సునీత మంగళవారం అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు. ఆమె మాట్లాడుతూ. 2018లో రైతులు కాలువల నిర్మాణానికి 1000 ఎకరాల భూములు ఇచ్చారన్నారు. వైసీపీ ప్రభుత్వం కేవలం 95 ఎకరాలకు మాత్రమే పరిహారం అందించారన్నారు. మిగిలిన 900 ఎకరాలకు పరిహారం ఇవ్వాలన్నారు.

సంబంధిత పోస్ట్