కనగానపల్లి మండలంలోని సోమరవాండ్లపల్లీలో ద్విచక్ర వాహనాన్ని (బైక్) తీసుకెళ్తున్న ఓ దొంగను కనగానపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. స్థానిక గ్రామస్తులు తెలిపిన వివరాలు.. బుధవారం రాత్రి గ్రామం లోని కుమ్మరి నాగేంద్ర అనే వ్యక్తి ఇంటి వద్ద నిలి పిన బైక్ను తీసుకెళ్లేందుకు దొంగలు ప్రయత్నిం చారు. ఇంతలో చుట్టు పక్కల వారు గమనించి దొంగలను వెంబడించారు. వారిలో ఓ దొంగను పట్టుకొని పోలీసులకు అప్పగించారు.