నిత్యావసర సరకులను సక్రమంగా పంపిణీ చేయాలి: తహశీల్దార్
ప్రజలకు అందుబాటులో ఉండి నిత్యవసర సరకులను రేషన్ షాపు డీలర్లు సక్రమంగా పంపిణీ చేయాలని రాప్తాడు తహశీల్దార్ విజయకుమారి డీలర్లకు సూచించారు. బుధవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో రేషన్ షాప్ డీలర్లకు సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ. ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా వచ్చే నెల బియ్యంతో పాటు రాగులు, జొన్నలు, చక్కెరను లబ్ధిదారులకు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.