రాయదుర్గం ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు అఖిలభారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు హనుమంత రాయుడు, సహాయ కార్యదర్శి ఆంజనేయులు మాట్లాడుతూ అఖిలభారత విద్యార్థి సమాఖ్య రాష్ట్ర మహాసభలు నవంబర్ 27, 28, 29, 30వ తేదిలలో విజయనగరం నందు జరుగుతాయన్నారు. ఈ మహాసభలకు ఏఐఎస్ఎఫ్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు.