రాయదుర్గం: అనంత రైతాంగాన్ని ఆదుకోండి: అనంత వెంకట్రామిరెడ్డి

51చూసినవారు
రాయదుర్గం: అనంత రైతాంగాన్ని ఆదుకోండి: అనంత వెంకట్రామిరెడ్డి
అనంతపురం జిల్లాను కరవు జిల్లాగా ప్రకటించాలని, జిల్లా రైతాంగాన్ని ఆదుకోవాలని జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం రాయదుర్గం నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఆయా మండలాల్లోని పలు ప్రాంతాలను సందర్శించి రైతులతో పంటల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 31 మండలాలను కరవు మండలాలుగా ప్రకటించి, రైతులను ఆదుకోవాలన్నారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్