ఓబులాపురం మైనింగ్ లో దొంగతనానికి పాల్పడిన పది మంది అరెస్ట్

79చూసినవారు
డి హీరేహల్ మండలం ఓబుళాపురం మైనింగ్ లో గతంలో సీబీఐ అధికారులు సీజ్ చేసిన దానిలో ఈనెల 17 వ తేదీన సుమారు 13 లక్షలు విలువైన వాహనాలను కట్టర్లతో కట్ చేసి దొంగతానికి పాల్పడ్డారు. హీరేహల్ ఎస్సై గురుప్రసాద్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేయగా కర్ణాటక బళ్లారికి చెందిన పదిమంది నిందితులను అరెస్ట్ చేసినట్లు రూరల్ సీఐ వెంకటరమణ సోమవారం మీడియాకి తెలిపారు. అక్రమాలకు ఎవరు పాల్పడిన కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్