మణిపూర్‌లో మళ్లీ మొదలైన హింస.. ఐదుగురు మృతి

66చూసినవారు
మణిపూర్‌లో మళ్లీ మొదలైన హింస.. ఐదుగురు మృతి
ఇప్పుడిప్పుడే ప్రశాంతంగా మారుతున్న మణిపూర్‌లో కథ మళ్లీ మొదటికొచ్చింది. జిరిబామ్ జిల్లాలో శనివారం జరిగిన హింసలో ఐదుగురు మరణించారని పోలీసులు తెలిపారు. మైయితీ, కుకీ వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో వీరు ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఒంటరిగా నివసిస్తున్న వ్యక్తి ఇంట్లోకి మిలిటెంట్లు ప్రవేశించి నిద్రలోనే కాల్చి చంపారు. దీంతో కొండల్లో ఇరు వర్గాలకు చెందిన సాయుధుల మధ్య భారీ ఎదురుకాల్పులు జరిగాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్