పుట్లూరు మండల వ్యాప్తంగా సంక్రాంతి పండుగలో మొదటి రోజు భోగి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. మండల పరిధిలోని ఎల్లుట్ల, మడ్డిపల్లి, కడవకల్లు, పుట్లూరు, శనగలగూడూరు, కోమటికుంట్ల, అరకటవేముల గ్రామాలలో అత్యంత భక్తిశ్రద్ధలతో ఇళ్ళ ముందర రంగవల్లులు వేసి పాత వస్తువులను పేర్చి భోగి మంటలు వేశారు. అనంతరం అందరూ సంతోషంగా గడిపారు.