గార్లదిన్నె మండలం ముకుందాపురం గ్రామంలో సోమవారం పశు వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. పశు వైద్య డాక్టర్ రమేశ్ మాట్లాడుతూ ఈ ఉచిత పశు వైద్య శిబిరంలో 98 దూడలకు నట్టల నివారణ, 152 పెద్ద పశువులకు బద్దె పురుగులు నివారణ మందులను తాపించడం జరిగిందన్నారు. పశువులకు వచ్చే వ్యాధుల గురించి రైతులకు పలు సూచనలు, సలహాలను పశువైద్యాధికారులు తెలిపారు.