నార్పల మండల కేంద్రంలోని దుర్గం ప్రాథమికోన్నత పాఠశాలను శుక్రవారం ఎంపీడీవో గంగావతి, ఈఓఆర్డీ శైలజరాణి తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి నాణ్యతను చూశారు. మెనూ ప్రకారం నాణ్యత గల భోజనాన్ని పిల్లలకు అందించాలని ఏజెన్సీ వారికి ఆదేశించారు. నాణ్యతలో ఎట్టి పరిస్థితులను రాజీపడేది లేదని హెచ్ఎంకి తెలిపారు. పాఠశాలలో సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.