నార్పల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పునః ప్రారంభించాలని నార్పల తహశీల్దార్ కార్యాలయం ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సిద్ధార్థ మాట్లాడుతూ గ్రామాల నుంచి కళాశాలకు వచ్చే
విద్యార్థులు మధ్యాహ్నం భోజనానికి ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న ఫీజులను చెల్లించాలన్నారు.