పుట్లూరు మండలంలో అకాల వర్షాలకు పప్పుశనగ పంట మొత్తం దెబ్బతిందని, నష్టపరిహారం ఇవ్వాలని రైతులు కలెక్టర్ వినోద్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. సోమవారం సింగనమలలో జరిగిన ప్రజా పరిష్కార వేదికలో టీడీపీ మండల తెలుగు యువత అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో శనగలగూడూరు రైతులు వెళ్లి కలెక్టర్ వినోద్ కుమార్, సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీకి వినతిపత్రం అందించారు.