సోమందేపల్లిలో దున్నపోతు ఊరేగింపు
సోమందేపల్లి మండల కేంద్రంలోని చెరువు నిండింది. దీంతో శుక్రవారం సోమందేపల్లి చెరువు కట్టపై గంగమ్మ తల్లికి గ్రామస్థులు దున్నపోతును బలి ఇవ్వనున్నారు. శుక్రవారం సోమందేపల్లిలో దున్నపోతును పూజలు నిర్వహించి పలు వీధులలో దున్నపోతును ఊరేగించారు. దున్నపోతుకు పసుపు, కుంకుమ పెట్టి వేపాకు, పూలు వేసి దళిత సోదరులు ప్రత్యేక పూజలు చేశారు.