ఎల్లారెడ్డి కస్తూర్భా గాంధీ బాలికల జూనియర్ కళాశాలలో ఫిజిక్స్ గెస్ట్ లెక్చరర్ పోస్టుకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు విద్యాలయ ప్రత్యేక అధికారి వీణాబాయి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎమ్మెస్సీ ఫిజిక్స్ తో పాటు బీఈడి పూర్తి చేసిన మహిళా అభ్యర్థులు ఈ నెల 4లోగా కేజీబీవీ ఎల్లారెడ్డిలో దరఖాస్తు చేసుకోవాలనని, మెరిట్ ప్రాతిపదికన ఎంపిక ఉంటుందని పేర్కొన్నారు.