యాడికి: ఇసుక ట్రాక్టర్లు సీజ్
ఇసుక అక్రమ రవాణా చేస్తున్న రెండు ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు ఆదివారం పోలీసులు తెలిపారు. పెద్దపప్పూరు మండలం నుంచి యాడికికి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నట్లు సమాచారం అందడంతో వెంటనే దాడులు చేసినట్లు చెప్పారు. ఇందులో రెండు ట్రాక్టర్లను సీజ్ చేసి స్టేషన్ కు తరలించినట్లు పేర్కొన్నారు.