AP: టీడీపీకి త్వరలో బిగ్ షాక్ తగలనుంది. సీఎం చంద్రబాబు తర్వాత పార్టీలో సీనియర్ నేతగా చెప్పుకునే మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. తనను ఎమ్మెల్సీగా కంటిన్యూ చేస్తారని భావించినా.. పార్టీ అధిష్టానం అలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో యనమల అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అసంతృప్తితోనే ఆయన ఎమ్మెల్సీ పదవి వీడ్కోలు సమావేశానికి హాజరు కాలేదనే ఊహగానాలు వస్తున్నాయి.