TG: రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లిలో విషాదం చోటుచేసుకుంది. 15 రోజుల ఆడ శిశువు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తల్లి చెప్పిన వివరాల ప్రకారం.. చిన్నారిని పడుకోబెట్టి స్నానానికి వెళ్లి.. తిరిగొచ్చే సరికి బకెట్‌లో శవమై కనిపించిందని పేర్కొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.