తాడిపత్రిలో విస్తృత తనిఖీలు
తాడిపత్రి మండలంలో ఆర్టీఓ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. మండల పరిధిలోని అనంతపురం- కడప ప్రధాన రహదారిపై మోటర్ వెహికల్ ఇన్ స్పెక్టర్ శ్రీనివాసులు శనివారం తనిఖీలు చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్క వాహనదారుడు తప్పకుండా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలన్నారు. ముఖ్యంగా వాహనాలలో పరిమితికి మించి ఎక్కించుకోరాదన్నారు. నెంబర్ ప్లేట్ లేకుండా తిరిగితే చర్యలు తప్పవని సూచించారు.