ఛత్తీస్‌గడ్ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత సుధీర్ అలియాస్ సుధాకర్ మృతి చెందాడు. బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో సుధీర్ చనిపోయారు. మృతి చెందిన ఐదుగురు మావోయిస్టుల్లో అగ్రనేత ఉన్నట్లు తెలియడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సుధీర్‌పై రూ.కోటి రివార్డ్ ఉంది. దీంతో ఛత్తీస్‌గడ్ ప్రాంతంలో హై అలర్ట్‌ను ప్రకటించారు. ఇప్పటికీ బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులకు, భద్రతాదళాల మధ్య ఎదురుకాల్పులు జరుగుతూనే ఉన్నాయి.