TG: పెళ్లి ఇష్టం లేక ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా బాన్సువాడ మండలంలోని కొల్లూరు గ్రామంలో చోటుచేసుకుంది. కాగా లక్ష్మి అనే యువతికి వెంకటేష్‌కు ఫిబ్రవరి 23న పెళ్లి కాగా.. మార్చి 25న లక్ష్మి ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. నవ వధువు మృతితో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయాలు అలుముకున్నాయి.