పెద్దపప్పూరు మండల వ్యాప్తంగా రైతన్నలు పంట నమోదు చేసుకున్న తర్వాత ఈ కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని మండల వ్యవసాయ అధికారి ఆంజనేయులు శుక్రవారం పేర్కొన్నారు. మండల పరిధిలోని చిక్కేపల్లి రైతు భరోసా కేంద్రం పరిధిలో ఉన్న చాగల్లు గ్రామ పొలం రైతులకు రబీలో సాగుచేసిన పప్పుశనగ, మొక్కజొన్న పండ్ల తోటలకు ఇన్సూరెన్స్ కొరకు ఈకేవైసీని అగ్రికల్చర్ అసిస్టెంట్ రంగనాయకులు చేస్తున్నారు.