అనారోగ్యంతో వృద్ధుడి బలవన్మరణం

60చూసినవారు
అనారోగ్యంతో వృద్ధుడి బలవన్మరణం
అనారోగ్యంతో బాధపడలేక వ్యవసాయబావిలో దూకి ఓ వృద్దుడు మృతి చెందిన ఘటన యాడికి మండలం గుడిపాడు వద్ద ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన చాకలి మద్దిలేటి (78) ఆయాసంతో తరచూ బాధ పడుతుండేవాడు. అనారోగ్యంపై పలు మార్లు చికిత్స చేయించుకున్నా నయం కాలేదు. ఈక్రమంలో గ్రామ సమీపంలో ఉన్న బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మోటార్లతో నీళ్లు తోడి మృతదేహాన్ని బయటకు తీశారు.

సంబంధిత పోస్ట్