ఘనంగా వైవీ కృష్ణారావు జయంతి

52చూసినవారు
ఘనంగా వైవీ కృష్ణారావు జయంతి
ఏపీ రైతు సంఘం నేత వైవీ కృష్ణారావు 110వ జయంతి వేడుకలను తాడిపత్రి పట్టణంలోని నెహ్రూపార్కులో ఆదివారం సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ కృష్ణాజిల్లాలో జన్మించిన వైవీ కృష్ణారావు రైతు సంఘంలో వివిధ హోదాల్లో పనిచేశారన్నారు. 1986లో అఖిల భారత కిసాన్ సభకు ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారని గుర్తు చేశారు.

సంబంధిత పోస్ట్