పెద్దమ్మతల్లికి ప్రత్యేక పూజలు

64చూసినవారు
పెద్దమ్మతల్లికి ప్రత్యేక పూజలు
యాడికి మండల కేంద్రంలో వెలసిన పెద్దమ్మతల్లి ఆలయంలో శనివారం జేష్టమాస ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం మామిడితోరణాలతో అరటిఆకులతో ఆలయ ప్రాంగణాన్ని అలంకరించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సుప్రభాతసేవ, నూతన వస్త్రాలు సమర్పించి గంగా కలశం పూజ, పంచామృతాభిషేకం నిర్వహించారు. కుంకుమార్చన, లలిత సహస్రనామావళి, భక్తి పాటలతో ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మికశోభను సంతరించుకుంది.

సంబంధిత పోస్ట్