తాడిపత్రిలో యువకుడి ఆత్మహత్య

63చూసినవారు
తాడిపత్రిలో యువకుడి ఆత్మహత్య
తాడిపత్రి పట్టణ సమీపంలోని యల్లనూరు రోడ్డులో ఉన్న రైల్వేగేట్ సమీపంలో శనివారం నరేష్ (23) అనే యువకుడు రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నాడని రైల్వే ఎస్ఐ నాగప్ప తెలిపారు. పుట్లూరు మండలం చాలవేముల గ్రామానికి చెందిన నరేష్ తల్లిదండ్రులతో పాటు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. కొంత కాలంగా చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తిచెంది రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్