తాడిపత్రి: రోడ్డు ప్రమాదంలో ఇరువురికి గాయాలు

59చూసినవారు
తాడిపత్రి: రోడ్డు ప్రమాదంలో ఇరువురికి గాయాలు
తాడిపత్రి మండలం సజ్జలదిన్నె గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గురువారం ఇరువురికి గాయాలయ్యాయి. గ్రామీణ సీఐ శివగంగాధర్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు సజ్జలదిన్నెకు చెందిన ఓబుళకొండారెడ్డి, లక్ష్మయ్యలు తాడిపత్రికి సొంత పని మీద వచ్చి తిరిగి బయలుదేరారు. సజ్జలదిన్నె వద్ద రోడ్డు దాటుతుండగా బుగ్గవైపు నుంచి అతివేగంతో వచ్చిన కారు ఢీకొంది. ఈ ఘటనలో ఓబుల కొండారెడ్డికి తీవ్రగాయాలవ్వగా, లక్ష్మయ్యకు స్వల్పగాయాలైనట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్