యాడికి మండల కేంద్రంలో ప్రతి ఒక్కరు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని తహశీల్దార్ ప్రతాప్ రెడ్డి శనివారం మీడియాకు ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలో 18 ఏళ్లు నిండిన వారు ఓటరు జాబితాలో నమోదు కోసం ఫారం 6, 7, 8, 8ఏ దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ప్రత్యేక ఓటరు నమోదు 10వ తేదీన ప్రతి ఒక్క బీఎల్ వారి పోలింగ్ కేంద్రం వద్ద హాజరు అవుతారని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.