కూడేరు మండల కేంద్రంలో శనివారం ఎన్టీఆర్ చిత్రపటానికి మండల టీడీపీ నాయకులు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. తెలుగు జాతి గుండెల్లో చెరగని జ్ఞాపకం క్రమశిక్షణకు పర్యాయపదం, తెలుగువారి ఆత్మగౌరవం, నందమూరి తారక రామారావు అని కొనియాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు చుక్కలు చూపించిన ఎన్‌టిఆర్ దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలను ఐక్య పథంగా నడిపించారు అన్నారు.