యూటీఎఫ్, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు జనవరి 5వ తేది ప్రజ్ఞా వికాస పరీక్షలు ఉంటాయని యూటీఎఫ్, ఎస్ఎఫ్ఐ నాయకులు తెలిపారు. ఆదివారం ఉరవకొండ ఎస్. కె ప్రభుత్వ పాఠశాల ఆవరణలో పరీక్షల కరపత్రాలను విడుదల చేశారు. జిల్లా అధ్యక్షుడు సిద్దు, సహాయకార్యదర్శి రామప్పచౌదరి మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలంటే విద్యార్థుల్లో భయాన్ని పోగొట్టేందుకు జనవరి 5న ప్రజ్ఞా వికాస మోడల్ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు.