పాఠశాల తరగతి గదిలోకి కోతులు వస్తుండటంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. ఉరవకొండ మండలం చిన్న ముష్టూరులోని ఆదర్శ పాఠశాలలో నిత్యం కోతుల బెడద కారణంగా ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. తాము తెచ్చుకుంటున్న భోజనం బాక్సులను ఎత్తుకెళ్తున్నాయని తెలిపారు. శుక్రవారం ఎస్ఎఫ్ఎ నాయకులు హారూన్ రషీద్, నందు పాఠశాలను సందర్శించారు.