ఉరవకొండ పంచాయతీ కార్యదర్శి, ఇన్‌ఛార్జ్ ఓఆర్డి గౌస్ సాహెబ్ గురువారం పారిశుద్ధ్య మెరుగు చర్యలు చేపట్టారు. మేస్త్రి లేపాక్షిని పంపి సిబ్బంది చేత పదో వార్డులోని పలు విధుల్లో నెలకొన్న అపరిశుభ్రత తొలగింపు చర్యలు చేపట్టారు. పిచ్చి మొక్కలు, ముళ్ళ మొక్కలను యుద్ధప్రాతికన తొలగించారు. సిబ్బంది చకచకా పనులు చేపట్టారు. దీంతో కాలనీ వాసులు మాలపాటి శ్రీనివాసులు, ప్రవీణ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.