వైభవంగా శ్రీభద్రకాళి సమేత వీరభద్రస్వామి కళ్యాణోత్సవం

56చూసినవారు
విడపనకల్లు మండలం ఉండబండలో వెలసిన శ్రీభద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి రథోత్సవం వైభవంగా జరిగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం వీరభద్రస్వామి కల్యాణోత్సవం అనంతరం సాయంత్రం రథోత్సవం వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజాం నుంచే మూలవిరాట్‌లను ప్రత్యేక ఆభరణాలతో అలంకరించారు. అభిషేకం, అర్చనలు, అలంకరణ, హోమాలు నిర్వహించారు. ఆలయ మండపంలో శ్రీభద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి కళ్యాణాన్ని నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్