బంజారా పరిరక్షణకు ప్రధాని మోదీ కృషి
వజ్రకరూరు మండలం రూపానాయక్ తండా గ్రామంలో బంజారా ధర్మ రచన కార్యదర్శి సుబ్రమణ్యం నాయక్ శుక్రవారం విలేఖరులతో మాట్లాడారు. దేశంలోని 15 కోట్ల మంది బంజారాల ఆరాధ్య దైవం సద్గురు సేవాలాల్ మహారాజ్ పవిత్ర సమాధి స్థలమైన మహారాష్ట్రలోని పౌరాఘడ్లో దేశ చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో 700 కోట్ల రూపాయలతో నంగారా భవనం, సంస్కృతి భవనంతోపాటు మ్యూజియం ఏర్పాటు చేయడం గర్వించదగ్గ విషయమన్నారు.