3 వారాల్లో అన్న క్యాంటీన్లు ప్రారంభం: మంత్రి

14525చూసినవారు
3 వారాల్లో అన్న క్యాంటీన్లు ప్రారంభం: మంత్రి
AP: అన్న క్యాంటీన్ల ప్రారంభంపై రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ది శాఖ మంత్రి నారాయణ కీల‌క ప్ర‌క‌టన చేశారు. వ‌చ్చే మూడు రాల్లో 100 క్యాంటీన్లు తెరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నామ‌ని వెల్ల‌డించారు. వీటి నిర్వహణ మళ్లీ ఇస్కాన్కు ఇవ్వాలా? టెండర్లు పిలవాలా? అనే దానిపై అధ్యయనం చేస్తున్నామ‌ని తెలిపారు. పేదలు, రోజువారీ కూలీల ఆకలి తీరుస్తామ‌ని, గతంలో 4 కోట్ల 60 లక్షల ప్లేట్ల ఆహారం అందించామ‌ని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్