వెదురుకుప్పం: మండలంలో ఉద్రిక్త వాతావరణం
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలంలో రోడ్డు పక్కన నిర్మించుకున్న నివాసాలను కొంతమంది రాజకీయ కక్ష్యతో నేలమట్టం చేస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపించారు. ఈ సందర్భంగా వారు బుధవారం ఉదయం మాట్లాడుతూ తాము ఇక్కడే 10 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నట్లు తెలిపారు. అధికారులు దౌర్జన్యంగా కూల్చివేస్తున్నారని తమకు న్యాయం చెయ్యాలని వారు కోరారు. తమను ఆదుకునే వారు లేరని ప్రజలు వాపోయారు.