ఎస్ఆర్ పురం: ఎంపీడీవో కార్యాలయాన్ని తనిఖీ చేసిన జడ్పీ సీఈవో
గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్ ఆర్ పురం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయాన్ని జడ్పీ సీఈవో రవికుమార్ నాయుడు మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం సిబ్బందితో సమావేశం నిర్వహించారు. గ్రామాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలపై సమీక్షించారు. సహకార బ్యాంకులో షేర్లు ఉన్న రైతులకు ఈకేవైసీ చేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.