చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ సోమవారం అసెంబ్లీలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ నియోజకవర్గ ప్రజలకు ఉన్న మూడు కోర్కెలను తీర్చాలన్నారు. అందులో మొదటిది అసంపూర్తిగా ఉండే 50 పడకల ఆసుపత్రిని పూర్తి చేయాలని చెప్పారు. రెండవది డయాలిసిస్ యూనిట్ కావాలని చెప్పారు. మూడవది బస్సు డిపోను నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కోరారు.