వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో బుధవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకులు, జిల్లా అధికారులు, మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ లు ఘన స్వాగతం పలికారు. స్వామివారికి ఇష్టమైన కోడె మొక్కులు చెల్లించుకున్నారు. బహిరంగ సభకు భారీగా కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు తరలివచ్చారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.